Tuesday, September 2, 2008

మేల్కొలుపు

ఊహలకు ఇది ఉషోదయం
ఉజ్వల భవితకు సోపానం
విశ్వవిద్యాలయాలలో అధ్యయనం.
కన్నవారికి కాంతులనిచ్చి
కానివారిని కలుసుకోనున్న విద్యార్థి తెలుసుకోవోయ్ !
ఆగడాల కాగడ కాకోయ్ !
ఆపదలోనున్న వారికి ఆప్తుడు కావోయ్.
ఆలోచనలకు రూపం యిచ్చి
ఆచరణ గావించి
అభివృద్ధిన దూసుకెళ్ళవోయ్ .

No comments: