Wednesday, September 3, 2008

జాగృతి

జగతికిదో పిలుపు
ప్రగతికదో మలుపు
కష్ట జీవుల కల నెరవేరేదాక
కలసికట్టుగా పోరాడదాం
రండి కదలి రండి
ఓటు అన్నది మన హక్కు
అవినీతి, అసమర్దులపై సందిధ్దాం.
భ్రష్టు పట్టిన రాజకీయాల తుప్పును వదిలిద్దాం
ఉక్కు పిడికిలి బిగిద్దాం
ఉగ్రరూపం దాల్చుదాం
ప్రగతి ఫలాలను అందుకునే వరకు
ఉదృతంగ పోరాడుదాం

Tuesday, September 2, 2008

మేల్కొలుపు

ఊహలకు ఇది ఉషోదయం
ఉజ్వల భవితకు సోపానం
విశ్వవిద్యాలయాలలో అధ్యయనం.
కన్నవారికి కాంతులనిచ్చి
కానివారిని కలుసుకోనున్న విద్యార్థి తెలుసుకోవోయ్ !
ఆగడాల కాగడ కాకోయ్ !
ఆపదలోనున్న వారికి ఆప్తుడు కావోయ్.
ఆలోచనలకు రూపం యిచ్చి
ఆచరణ గావించి
అభివృద్ధిన దూసుకెళ్ళవోయ్ .

symbal of innocent

సుగందాల సుగుణం పువువ
స్వచ్ఛతకు రూపం పువువ
సప్తవర్ణల సలక్షణం పువువ
నిష్కల్మప్రేమకు చిహ్నం పువువ
అమాయకత్వానికి అధ్దం పువువ
మౌనభాషకు అర్థం పువువ
అభిషేకానికి అణువు పువువ
అందానికి ఆదర్శం పువువ
అతివుల అనుగ్రహానికి పువువ
ఆహ్లాదాల వాసనలకు పువువ
అందుకే అఖిల జనులకు ఇష్టం పువువ